News August 12, 2025

ఏలూరు: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

జాతీయ రహదారిపై టీ తాగేందుకు ఆగిన వ్యక్తిని రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ మూర్తి (35)గా గుర్తించిన అతన్ని సోమవారం రాత్రి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టీ తాగేందుకు ఆగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు.

Similar News

News March 15, 2026

నావిక్‌కు అంతరాయం

image

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.

News March 15, 2026

విశాఖలో వంకాయలు రూ.28

image

విశాఖలోని 15 రైతు బజార్లలో ఆదివారం కాయగూరల ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.8, ఉల్లిపాయలు రూ.19, కాలీఫ్లవర్ రూ.12, క్యాబేజీ రూ.12, వంకాయలు రూ.28, బెండకాయలు రూ.30, కాకరకాయలు రూ.26, క్యారెట్ రూ.28, గోరుచిక్కుడు రూ.34, బీన్స్ రూ.40, కర్ర పెండ్లం రూ.16, నిమ్మకాయలు రూ.125, గ్రీన్ పీస్ రూ.34గా ఉన్నాయి.

News March 15, 2026

నరసరావుపేటలో చికెన్ ధరల సెగ.. కేజీ ఎంతంటే!

image

నరసరావుపేటలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. లైవ్ కోడి కిలో రూ. 175 ఉండగా, స్కిన్ లెస్ ధర రూ. 345కు చేరింది. మటన్ కిలో రూ. 1000 వరకు పలుకుతోంది. ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు మాంసం కొనాలంటేనే జంకుతున్నారు. సరఫరా మెరుగుపడితేనే ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.