News October 5, 2025

ఏలూరు: వెబ్ సైట్‌లో 19 కేడర్ల మెరిట్ లిస్ట్

image

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సర్వజన ఆసుపత్రిలో 19 కేడర్లలో ఉద్యోగ ఖాళీలకు ఈ ఏడాది మే 30న అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను https://eluru.ap.gov.in, https://westgodavari.ap.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచామని కాలేజీ ప్రిన్సిపల్ డా. సావిత్రి శనివారం తెలిపారు. అక్టోబర్ 13 లోపు లిస్ట్ పై అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో తెలపాలన్నారు.

Similar News

News January 14, 2026

NLG: లండన్ వేదికగా చేనేత కళా వైభవం

image

చండూరుకు చెందిన చేనేత కళాకారుడు చిలుకూరి శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత నైపుణ్యాన్ని చాటనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు లండన్‌లో జరిగే ‘స్ప్రింగ్ ఫెయిర్’ వర్తక ప్రదర్శనలో చేనేత లైవ్ డెమో ఇచ్చేందుకు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 29న ఆయన లండన్ బయలుదేరనున్నారు. తన ఎంపికకు సహకరించిన కేంద్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 14, 2026

పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

image

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.

News January 14, 2026

వేరుశనగలో దిగుబడి పెరగాలంటే!

image

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.