News March 27, 2024

ఏలూరు: వైసీపీలోకి గోపాల్ యాదవ్.. ప్రభావం చూపేనా..?

image

ఏలూరు పార్లమెంట్ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి కారుమూరి సునీల్ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి సీటు ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ వైసీపీలో చేరారు. తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం టీడీపీకి మైనస్ అవుతుందా..? వైసీపీకి కలిసివస్తుందా..? కామెంట్ చేయండి.

Similar News

News February 11, 2026

వేల్పూరు డంపింగ్ యార్డులో మృతదేహం కలకలం

image

తణుకు మండలం వేల్పూరు డంపింగ్ యార్డులో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మృతదేహం మూడు రోజుల క్రితానిదిగా, పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌ఛార్జ్ ఎస్ఐ జనా సతీష్ పేర్కొన్నారు.

News February 11, 2026

భీమవరంలో డయాలసిస్ కష్టాలు.. జిల్లా కేంద్రంలోనే లేని వైద్య సేవలు!

image

జిల్లా కేంద్రం భీమవరంలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న సెంటర్‌ను తొలగించడంతో చికిత్స కోసం పాలకొల్లు, ఆకివీడు వెళ్లాల్సి వస్తోంది. దూర ప్రయాణం భారమై ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నామని, వెంటనే పట్టణంలో తాత్కాలిక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News February 11, 2026

నరసాపురం: తీరంలో అలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత

image

నరసాపురం, మొగల్తూరు సముద్ర తీర ప్రాంతాల్లో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తీరానికి వచ్చే ఈ తాబేళ్లు.. ఈ ఏడాది వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది.