News October 7, 2025

ఏలూరు: శిశుగృహాన్ని తనిఖీ చేసిన సీడబ్ల్యూసీ ఛైర్మన్‌

image

ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని శిశుగృహ వసతి గృహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్మన్ పుచ్చల వెంకటేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిశు గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం, పిల్లల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ తనిఖీలో శిశుగృహ మేనేజర్ భార్గవి పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు వెల్లుల్ల మహిళ

image

మెట్ పల్లి మండలం వెల్లుల్లకు చెందిన జాగృతి మహిళ మండల సమాఖ్య అధ్యక్షురాలు గోర్ల లతకు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. గొర్ల లత స్వశక్తి సంఘంలో చేరి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలిగా, జాగృతి మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నుకోబడి జిల్లా మహిళ సమాఖ్య ఈసీ మెంబర్గా ఉన్నారు. గణతంత్ర వేడుకలకు ఎంపికైన ఆమెను ఏపీఎం, సీసీలు, మహిళ సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు అభినందించారు.

News January 23, 2026

NLG: రా మెటీరియల్ సరఫరాకు దరఖాస్తుల ఆహ్వానం

image

అనుముల, డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల(ITI)లకు రా మెటీరియల్ సరఫరా చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ ITI ప్రిన్సిపల్ తెలిపారు. సుమారు రూ.31,93,200 వ్యయంతో ఈ ముడి సరుకులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన సరఫరాదారులు టెండర్ ఫారాలు, పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News January 23, 2026

HYD: CNG కావాలంటే క్యూ కట్టాల్సిందే!

image

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్‌లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.