News April 2, 2024
ఏలూరు: UPDATE.. ఆ ‘కిల్లర్ డాక్టర్’ అరెస్ట్

మత్తు ఇంజక్షన్స్ ఇస్తూ చోరీలకు అలవాటు పడి ఓ <<12965125>>వ్యక్తి ప్రాణం<<>> తీసిన వైద్యుడి బాగోతం తెలిసిందే. ఆ దొంగ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్రంపాడుకు చెందిన కొవ్వూరి భానుసుందర్ MBBS చదువుతున్నప్పటి నుంచి బెట్టింగ్స్‌కు అలవాటు పడి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఇలా మత్తు ఇంజక్షన్లు ఇస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. సోమవారం భానుసుందర్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
Similar News
News February 11, 2026
నరసాపురం: తీరంలో అలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత

నరసాపురం, మొగల్తూరు సముద్ర తీర ప్రాంతాల్లో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తీరానికి వచ్చే ఈ తాబేళ్లు.. ఈ ఏడాది వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది.
News February 10, 2026
ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్ ద్వారానే

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News February 10, 2026
ప.గో: ట్రంప్ టారిఫ్ తగ్గించినా.. ‘సిండికేట్’ వదలడం లేదు (2/3)

ఉమ్మడి ప.గో. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇటీవల ట్రంప్ ఎగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో మేలు జరుగుతుందని రైతులు భావించారు. అయితే సిండికేట్ వ్యాపారుల వల్ల రైతులకు ఫలితం దక్కడం లేదు. మేతలు, విత్తనాల ధరలు పెంచి ట్రేడర్లు లాభాలను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సిండికేట్ల దోపిడీ నుంచి విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.


