News September 12, 2025
ఏ తల్లి నిను కన్నదో..!

ఓ నవజాత శిశువును ముళ్లపొదల్లో వదిలి వెళ్లిన అమానవీయ ఘటన కళ్యాణదుర్గంలో జరిగింది. పసికందు ఏడుపులు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ICDS సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని ప్రజలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 10, 2025
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సబ్ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పంచాయతీల వారీగా ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
News December 10, 2025
కేంద్రమంత్రిని కలిసిన కాకినాడ MP

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మామిడి తాండ్రపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించినందుకు ఎంపీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ప్రధాన జీవనోపాధిగా ఉందని, ఈ తగ్గింపు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు మరింతగా పెరగనున్నాయని ఎంపీ వివరించారు.
News December 10, 2025
కరీంనగర్: మూడో విడతతో 20 GPలు ఏకగ్రీవం

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల్లో 20 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. జగిత్యాల జిల్లాలో 6, సిరిసిల్ల – 7, కరీంనగర్ – 1, పెద్దపల్లి జిల్లాలో 6 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా, మొదటి విడత రేపు పోలింగ్ జరగనుండగా, రెండో విడత 14న, విడత మూడో విడత 17న పోలింగ్, అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు.


