News September 13, 2025

ఐఐటీ జామ్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ..!

image

ఐఐటీ జామ్-2026 ప్రవేశ పరీక్షకు గణితశాస్త్రంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు HNK యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణితశాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొ.డా.టి.నాగయ్య తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువ మంది హాజరవుతుండగా ఈనెల 15 నుంచి ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

భద్రాద్రి: ‘ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేయాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను సాధారణ పరిశీలకులు వి. సర్వేశ్వర రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓ, ఏఓ, ఏఈఓ, పోలీస్ శాఖ, ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ CEO నాగలక్ష్మి ఉన్నారు.

News December 5, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 5, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.32 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 5, 2025

జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

image

జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ప్రకటించారు. మెట్ పల్లి మండలం చింతల్ పెట్ గ్రామ సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేష్, మూలరాంపూర్ సర్పంచ్‌గా కనుగంటి లాస్య ప్రియ, కథలాపూర్ మండలం రాజారాం తండ సర్పంచ్‌గా భుఖ్య తిరుపతి ఎన్నికైనట్లు పేర్కొన్నారు.