News December 2, 2025

ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని CSIR-<>IICT<<>> 10 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్(జనరల్ నర్సింగ్/ANM), ఫార్మసీ టెక్నీషియన్, టెక్నీషియన్( క్యాటరింగ్&హాస్పిటాలిటీ) పోస్టులు ఉన్నాయి. నెలకు జీతం రూ.39,545 చెల్లిస్తారు. ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in

Similar News

News February 19, 2026

తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

image

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.

News February 19, 2026

తాబేళ్లను మొక్కుబడిగా సమర్పించే దేవాలయం!

image

అస్సాంలోని హజోలో మణికూట పర్వతంపై విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి కోనేరులో భక్తులు తాబేళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. తాబేళ్లను కూర్మావతారంగా పూజిస్తారు. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడు మోక్షం పొందిన ‘మహాముని’ క్షేత్రంగా కొలుస్తారు. క్రీ.శ.1583లో నిర్మితమైన ఆలయ శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధు, కైటభ రాక్షసులను విష్ణుమూర్తి ఇక్కడే సంహరించారని పురాణాల వాక్కు.

News February 19, 2026

స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

image

20ల్లోకి అడుగుపెట్టగానే స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్‌ క్లెన్సర్‌ ఫేస్ వాష్, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడాలి. వారానికోసారి స్క్రబ్‌, పీల్స్‌ అప్లై చేయాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు, గీతలు దూరం అవుతాయి. వీటితో పాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లున్న ఆహారాన్ని తీసుకోవాలి.