News December 1, 2025
ఐటీ జాబ్ వదిలి.. ఆవులతో రూ.2 కోట్ల టర్నోవర్!

పని ఒత్తిడితో రూ.లక్షల జీతం వచ్చే IT కొలువు కన్నా, గోవుల పెంపకమే మేలనుకున్నారు అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, చార్మి దంపతులు. జాబ్ వదిలి, 2014లో 4 ఆవులను కొని వాటి పాలు, పేడతో ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మారు. కల్తీలేని గోఉత్పత్తులకు డిమాండ్ పెరగ్గా మరిన్ని ఆవులను కొన్నారు. కట్ చేస్తే 2024 నాటికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
Similar News
News February 13, 2026
15 చోట్ల హంగ్.. ఇండిపెండెట్లే కీలకం

TG: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏకంగా 15 చోట్ల హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, అలియాబాద్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఛైర్‌పర్సన్ ఎన్నికకు ఇండిపెండెంట్ల ఓట్లు, అలాగే ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలకం కానున్నాయి.
News February 13, 2026
విషాదం, శుభకార్యాల సమయాల్లో లోన్ రికవరీ వద్దు: RBI

రుణాలు తీసుకున్న వారి ఇళ్లలో విషాదం చోటుచేసుకున్నప్పుడు లేదా శుభ కార్యాలు జరిగే సమయాల్లో లోన్ రికవరీ చేయొద్దని RBI బ్యాంకులను ఆదేశించింది. ‘రుణ రికవరీ విధానం అన్ని బ్యాంకుల్లో ఒకేరీతిన ఉండాలి. నిర్దేశిత రూల్స్ ప్రకారం ఏజెంట్ల నియామకం చేపట్టాలి. రికవరీ కోసం వారు చేసే ఫోన్ కాల్స్‌ను రికార్డు చేయాలి’ అని పేర్కొంది. రుణగ్రహీతల డేటాను ఉద్యోగులు, ఏజెంట్లు దుర్వినియోగం చేయకుండా చూడాలని సూచించింది.
News February 13, 2026
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా

TG: నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను సొంతం చేసుకుంది. అటు సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, నేరేడుచర్లలోనూ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తిరుమలగిరిలో BRS గెలిచింది.


