News August 23, 2025
ఐతుపెల్లి : హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి

పెగడపల్లి మండలం ఐతుపెల్లి గ్రామంలో ఈరోజు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సెంటర్ ను అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Similar News
News January 23, 2026
ORRపైకి యువతీ యువకులు.. కిక్కు కోసం కాదు!

నగర Gen-Z రూటే సపరేటు. ‘మత్తు’ కిక్కు కంటే భక్తిలో వచ్చే ‘హై’కే వీరు ఫిదా అవుతున్నారు. ORR సోలార్ ట్రాక్‌లపై స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్-రేట్ సింక్ చేస్తూ భజన పాటలకు రన్నింగ్ చేస్తున్నారు. కీర్తనలకు తగినట్టు SMలో AR ఎఫెక్ట్స్‌తో రీల్స్ చేస్తూ రచ్చ లేపుతున్నారు. IIIT-H, JNTU నుంచే వారానికి 7 వేల మంది గచ్చిబౌలి- నెక్లెస్ రోడ్ వరకు వెళ్తున్నారు. యువతలో ఒంటరితనాన్ని పోగొడుతూ, మహిళలకు భద్రతనిస్తోంది.
News January 23, 2026
రేపటి నుంచి రష్యా-ఉక్రెయిన్-అమెరికా కీలక చర్చలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా తొలి అడుగుగా UAEలో రేపటి నుంచి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. జనవరి 23, 24 తేదీల్లో ఉక్రెయిన్, అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దావోస్‌లో ప్రకటించారు. ఇది మొదటి త్రైపాక్షిక భేటీ కావడం విశేషం. US అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
News January 23, 2026
మధిర: జిల్లాల రద్దు లేదు: భట్టి

తెలంగాణలో కొత్త జిల్లాలను ఎత్తివేస్తారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముగింపు పలికారు. జిల్లాల రద్దు అనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సింగరేణి సంస్థ ఆస్తులను కాపాడతామని, సంస్థ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. సింగరేణి వివాదంపై రేపు పూర్తి వివరాలతో బహిరంగంగా మాట్లాడతానని ఆయన వెల్లడించారు.


