News November 19, 2025
ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.
Similar News
News January 18, 2026
తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2026
కొల్లూరు: సైన్స్ ఫెయిర్‌కు 210 మంది

కొల్లూరులో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. పాఠశాలలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఆరు రాష్ట్రాల నుంచి 210 విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని చెప్పారు. సైన్స్ ఫెయిర్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
News January 18, 2026
తెర్పోల్ చెరువులో దూకి వ్యక్తి మృతి

కొండాపూర్‌కు చెందిన దొబ్బల రాజు గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని దర్గాకు వెళ్లి తిరిగి రాలేదు. వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం తెర్పోల్ శివారులో చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


