News August 21, 2025

ఐనవోలు ఇన్‌ఛార్జి ఈవోగా సుధాకర్

image

ఐనవోలు మల్లన్న ఆలయ ఇన్‌ఛార్జి ఈవోగా కందుల సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఎంతో పేరు ప్రఖ్యాత కలిగిన ఐనవోలు మల్లన్న దేవస్థానంలో బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. కరీంనగర్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం మార్కెట్ రోడ్ ఈవోగా బాధ్యతలో ఉంటూ, ఐనవోలు మల్లికార్జున స్వామి ఇన్‌ఛార్జిగా ఉండటం తన అదృష్టమన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 19, 2026

న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి.. షమీ ఉండాల్సిందేమో!

image

న్యూజిలాండ్‌తో సిరీస్ కోల్పోయి టీమ్ ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ముఖ్యంగా NZ ప్లేయర్ మిచెల్ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. సిరీస్‌లో అతను 352 పరుగులతో విధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలువురు స్టార్ బౌలర్ షమీని గుర్తు చేస్తున్నారు. అతడు ఉండుంటే మిచెల్ ఆటలు సాగేవి కావని, గత రికార్డులే అందుకు నిదర్శనమని అంటున్నారు. ఇరువురి మధ్య పోరులో 16 సగటుతో 4 సార్లు ఔట్ చేసి షమీ ఆధిపత్యం ప్రదర్శించారు.

News January 19, 2026

అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

image

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

News January 19, 2026

వన దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

image

మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టినట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు.