News August 22, 2025

ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ప్రభాకర్..?

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌ను ఎన్నుకునేందుకు నిర్ణయించినట్లు సమాచారం. MLA నాగరాజు త్వరలో ట్రస్ట్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. సభ్యులు చిరంజీవి, రేణుక, ఆనందం, కీమా, కుమారస్వామి, పూర్ణ చందర్, వెంకన్న, మహేందర్ రాజయ్య, నర్సింహారెడ్డి, రాజు, బుచ్చిరెడ్డి, వెంకటలక్ష్మి, పాతర్లపాటి రవీందర్ ఉన్నారు.

Similar News

News January 18, 2026

ఇండియాకు mitc‘Hell’ చూపిస్తున్నాడు..

image

భారత బౌలర్లకు న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ చుక్కలు చూపిస్తున్నారు. గత మ్యాచులో సెంచరీతో చెలరేగిన ఈ ప్లేయర్ మూడో వన్డేలోనూ అర్ధశతకం బాదారు. 56 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్‌లో అతడికి ఇది మూడో 50+ స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా వన్డేల్లో భారత్‌పై 11 ఇన్నింగ్సుల్లో 600+ రన్స్ చేయగా ఆరు సార్లు 50+కి పైగా పరుగులు చేశారు. అద్భుతమైన ఫామ్‌తో ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నారు.

News January 18, 2026

పోచంపల్లి ఇక్కత్‌కు జర్మనీ దేశస్థులు ఫిదా!

image

అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీని చూసి జర్మనీ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు. ఆదివారం వారు భూదాన్ పోచంపల్లిని సందర్శించి, టూరిజం పార్కులోని మగ్గాలను పరిశీలించారు. నూలుదారానికి రంగులు అద్దడం, చిటికిలుచుట్టడం, మగ్గంపై చీర నేసే ప్రక్రియను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక దుకాణాల్లో ఇక్కత్ వస్త్రాలను కొనుగోలు చేశారు. చేనేత కళాకారుల నైపుణ్యాన్ని వారు అభినందించారు.

News January 18, 2026

సీఎం పర్యటనకు ఇందిరమ్మ చీరలతో రాకుంటే జరిమానా!

image

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు డ్వాక్రా మహిళా సంఘాలను రావాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలతో సీఎం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని లేకుంటే రూ.500, రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. బలవంతంగా పనులు వదిలేసి తాము ఎలా వెళ్లాలని మహిళా సంఘాలు సతమతమవుతున్నారని సమాచారం.