News March 7, 2025

ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 15, 2025

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష.. చీఫ్ రాజీనామా

image

ప్రపంచంలోనే కఠినమైన పరీక్షలలో ఒకటైన సౌత్ కొరియా ‘సన్‌అంగ్’ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ఏడాది ఇంగ్లిష్ పేపర్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సన్‌అంగ్ చీఫ్ ఓ సుంగ్‌ గియోల్ రాజీనామా చేశారు. ప్రతి ఏడాది నవంబర్‌లో జరిగే ఈ 8 గంటల పరీక్ష వర్సిటీల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగావకాశాలను నిర్ణయిస్తుంది. 1993 నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే పూర్తి పదవీకాలం కొనసాగారు.

News December 15, 2025

ధారూర్‌ మండలంలోని సర్పంచ్‌‌లు వీళ్లే..

image

ధారూర్‌ మండలంలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
అల్లాపూర్-విజయలక్ష్మీ
తరిగొప్పుల-అంజిలయ్య
అంతారం-సువర్ణ
అల్లీపూర్-వీరేశం
చింతకుంట-చంద్రయ్య
కెరెల్లీ-పద్మమ్మ
కొండాపూర్ కుర్ద్-స్వాత

News December 15, 2025

మూడు దేశాల పర్యటనకు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. 15-16న జోర్డాన్, 16-17న ఇథియోపియా, 17-18న ఒమన్‌కు ఆయన వెళ్తారు. ‘లింక్ వెస్ట్’ పాలసీ, ‘ఆఫ్రికా ఇనిషియేటివ్‌’లో భాగంగా ఆ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనున్నారు.