News March 12, 2025

ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

ఐ.పోలవరం (M) బాలయోగి వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో తాళ్లరేవు మండలం సుంకరపాలెంకు చెందిన వేళ్ల వీరేంద్ర, ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన వేమవరపు సాంబశివ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైకుపై వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News February 19, 2026

HYDలో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్..!

image

FEB 20,21,22 తేదీల్లో 3రోజులు HYDలో అగ్రి షో పేరుతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. NTR స్టేడియంలో ఈ ప్రోగ్రాం ఉంటుందని.. 3రోజుల్లో లక్షమంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దేశ, విదేశాల నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కుపైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. www.rbagrishow.com.

సెన్సెక్స్ 750 పాయింట్లు డౌన్.. కారణాలివే

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటివి సూచీలను కిందకు లాగాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు పతనమై 82,974 వద్ద, నిఫ్టీ 211 క్షీణించి 25,607 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, TCS షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. KWIL, ట్రెంట్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.