News April 25, 2024
ఒంగోలులో కానిస్టేబుల్ రత్నబాబుపై వేటు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్ డి.ఎన్.బి. రత్నబాబు అలియాస్ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలులో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జస్వంతరావు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రత్నబాబుపై కేసు కూడా నమోదైంది.
Similar News
News April 12, 2026
ప్రకాశం: కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు(M)లో తండ్రి తన 13 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే 2, 3 రోజుల నుంచి బాలికకు కడుపు నొప్పి వస్తుండటంతో ఒంగోలు రిమ్స్ కు తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు PS హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 12, 2026
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం ధర్మవరంలో RMP డాక్టర్ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న CI సుబ్బరాజు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.