News November 6, 2025
ఒంగోలులో తొలిసారి షూటింగ్ టోర్నమెంట్.!

ప్రకాశం జిల్లాకు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ బుధవారం చర్చించారు.
Similar News
News January 17, 2026
మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
News January 17, 2026
నేడు దర్శి రానున్న మంత్రులు

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.