News February 22, 2025
ఒంగోలు: పెళ్లిలో భోజనాల వద్ద గొడవ

పెళ్లిలో భోజనాల గొడవ గాలివానలా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఒంగోలులోని ఓ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి పెళ్లి జరిగింది. అందులో జిలానీ భోజనాలు వడ్డిస్తుండగా, తమకు సరిగా మర్యాద చేయలేదని అన్వర్, నజీర్, సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతటితో వివాదం ముగిసిందనగా, విందు ముగిసిన తరువాత జిలానీపై ముగ్గురు దాడి చేశారు. జిలానీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 16, 2025
మహిళా రక్షణ మా ప్రథమ కర్తవ్యం: ఎస్పీ

ప్రకాశం జిల్లాలోని మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆరు బృందాలుగా 36 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శక్తి టీమ్స్ ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News March 16, 2025
ప్రకాశం: 10వ తరగతి ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లైవ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆరు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్‌కు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎగ్జాం సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 16, 2025
ఒంగోలు రిమ్స్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా నిన్న రాత్రి 11.30 గంటలకు ఒంటరిగా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. క్యాజువాలిటీ వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో సీనియర్ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించారు. సంబంధిత డాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్ ఉన్నపళంగా ఆసుపత్రికి రావడంతో సిబ్బంది షాక్ అయ్యారు. మహిళా కలెక్టర్ రాత్రివేళ చెకింగ్ చేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.