News November 20, 2025
ఒంగోలు మాజీ MP హత్యలో అతనే సూత్రధారి..?

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుమారు 37ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న టెక్ శంకర్ పలు మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. అందులో 1995 డిసెంబర్ 1న ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల కేసులో సైతం టెక్ శంకర్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 17, 2026
ఆసిఫాబాద్: వంశీకి గ్రూప్-3 నియామక పత్రం

బెజ్జూర్ మండలం బారేగూడకి చెందిన బొర్కూట్ వంశీ గ్రూప్-3 ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్‌గా నియామకమయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వంశీ నియామక పత్రాన్ని అందుకున్నారు. కుమారుడు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికవ్వడంపై తల్లిదండ్రులు గంగారం-సుగుణ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
News January 17, 2026
KNR: ఈనెల 20న అప్రెంటిస్‌షిప్ ఇంటర్వ్యూలు

జహీరాబాద్, సంగారెడ్డిలోని మహీంద్రా సంస్థలో 300 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి ఈ నెల 20న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై, 18-25 ఏళ్ల వయసున్న కరీంనగర్ జిల్లా గ్రామీణ యువత దీనికి అర్హులు. ఆసక్తి గలవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో కరీంనగర్‌లోని స్వశక్తి కళాశాలలోని ఈజీఎంఎం కార్యాలయంలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News January 17, 2026
GNT: ఉద్యోగాల పేరిట మోసం.. రూ.85 లక్షలు స్వాహా!

విదేశాల్లో చదువు, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గుంటూరుకు చెందిన ముప్పాళ్ల లీలాకృష్ణను నల్గొండ (D) చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ DSP రమేశ్ తెలిపారు. పోలేపల్లికి చెందిన కరుణభాయ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి, నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, 3 ఫోన్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.85 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.


