News July 9, 2024
ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లు రద్దు
మూడో కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. (07500)విజయవాడ-గూడూరు, (12743/44)విజయవాడ-గూడూరు వెళ్లే ఈ రైళ్లను 15 నుంచి 30 వరకు, (07576) ఒంగోలు-విజయవాడ, (07461) విజయవాడ-ఒంగోలు వెళ్లే రైళ్లను 16 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 12, 2024
లోక్ సభ స్పీకర్‌తో బాపట్ల ఎంపీ భేటీ
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఎంపీ కృష్ణ ప్రసాద్ సత్కరించి అభినందనలు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలోని అద్దంకి, పర్చూరు, చీరాల, బాపట్ల, సంత నూతలపాడు, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో నెలకొన్న పలు సమస్యలను ఆయనతో చర్చించారు.
News October 12, 2024
కొండపి పొగాకు బోర్డులో ముగిసిన కొనుగోళ్లు
శుక్రవారం రోజుతో కొండపి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 2023-24కు సంబందించి పొగాకు కొనుగోళ్లు ముగిశాయని వేలం కేంద్రం నిర్వహణ అధికారి సునిల్ కుమార్ తెలిపారు. కొనుగోళ్లు 154 రోజుల పాటు నిర్వహించామని, వేలంలో 50 కంపినీలు పాల్గొన్నాయన్నారు. రూ.467కోట్ల కొనుగోళ్లు జరిగాయని ఆయన వెల్లడించారు. రోజుకు సగటున 873 బేళ్ళ అమ్మకాలు జరిగాయన్నారు.
News October 11, 2024
మార్కాపురం: డ్రైనేజీలో పసికందు
మార్కాపురంలో మానవత్వం మంట కలిసింది. పట్టణంలోని కంభం సెంటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో అప్పుడే పుట్టిన శిశువును డ్రైనేజీ కాలవలు శుభ్రం చేస్తుండగా కాలువలో మున్సిపల్ కార్మికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత పసికందును పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో కాలువలో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.