News May 7, 2025
ఒంగోలు: స్కూటీ.. హత్య కేసును మలుపు తిప్పింది

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా దొరికిన స్కూటీ ఆధారంగా కేసు పురోగతి ఊపందుకుంది. అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ గ్రామం పోలీసుల కనుసన్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఈ నెల 29వ తేదీన అమెరికాకు వెళ్లటానికి టికెట్స్ కూడా బుక్ చేసుకోగా స్కూటీ ఆధారంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 13, 2026
తూ.గో జిల్లాలో ఈనెల 17న డీ-వార్మింగ్ డే- డీఎంహెచ్‌ఓ

తూర్పుగోదావరి జిల్లాలోని అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ నెల 17న జాతీయ డీ-వార్మింగ్ డే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ రోజు మాత్రలు వేసుకోలేని వారి కోసం 24న ‘మాప్-అప్ డే’ ఏర్పాటు చేశామన్నారు. వయసును బట్టి ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని, పిల్లలకు ఆహారం తిన్న తర్వాతే వీటిని వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
స్వదేశీ ఆపిల్స్‌ను గుర్తించండిలా!

ఆరోగ్యానికి మేలు చేసే <<19126815>>స్వదేశీ<<>> ఆపిల్ పండ్లను ఇలా గుర్తించవచ్చు. స్వదేశీ ఆపిల్స్ సహజమైన రంగులో తక్కువ మెరుపుతో ఉంటాయి. వీటిపై విదేశీ రకాల వలె కృత్రిమ మైనం పూత ఉండదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాయల్ డెలీషియస్, పసుపు రంగు గోల్డెన్ డెలీషియస్, కశ్మీర్ స్పెషల్ అంబ్రి రకాలు మన దేశంలో ప్రసిద్ధి. తాజాదనం, రుచి కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. share it
News February 13, 2026
జగిత్యాల: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్, కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ జరుగుతున్న తీరును జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ పరిశీలించారు.


