News April 22, 2024

ఒంగోలు MP మాగుంట కుటుంబంలో విషాదం

image

ఒంగోలులో దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి కుమారుడు విజయ్ రెడ్డి (విజయ్ బాబు) సోమవారం ఉదయం నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయనకు పలు అనారోగ్య సమస్యలుండటంతో ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించినా ఉపయోగం లేకపోయింది. ఒంగోలు నుంచి MPలుగా ఆయన తల్లిదండ్రులు సుబ్బరామరెడ్డి, పార్వతమ్మ ఇద్దరూ గెలిచారు. ప్రస్తుతం మృతుని బాబాయ్ శ్రీనివాసులరెడ్డి TDP తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు.

Similar News

News December 12, 2025

ఒంగోలు: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలుశిక్ష

image

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వఅదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. హెచ్ఎంపాడు మండలానికి చెందిన రవి ఓ యువతిని నమ్మించి మోసం చేసినట్లుగా 2018లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో రవికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

News December 12, 2025

ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

image

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 12, 2025

ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

image

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.