News August 12, 2025

ఒంటిమిట్టలో ప్రశాంతం.. పులివెందులలో టెన్షన్

image

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు వైసీపీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. అయితే పులివెందులలోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఒంటిమిట్టలో ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Similar News

News March 16, 2026

సిద్దిపేట: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు:కలెక్టర్

image

సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, బీసీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికల భద్రత విషయంలో రాజీ పడొద్దని, కామన్ డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్లను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News March 16, 2026

వయసుల వారీగా పిల్లలకు వేయించాల్సిన టీకాలు

image

* 24 గంటలు- BCG, హెపటైటిస్ B
* 6 వారాలు- OPV-1, RVV-1, FIPV-1, పెంటా-1, PCV-1
* 10 వారాలు- OPV-2, RVV-2, పెంటా 2
* 14 వారాలు- OPV-3, RVV-3, FIPV-2, పెంటా3, PCV2
* 9-12 నెలలు- MR1, JE1, FIPV3, PCV-B
* 16-24 నెలలు- MR2, JE2, OPV బూస్టర్, DPT 1
* 5-6 ఏళ్లు- DPT-2
* 10 ఏళ్లు TD-1 బూస్టర్; * 16 ఏళ్లు TD2 బూస్టర్
* 14ఏళ్ల బాలికలకు HPV
(నేడు నేషనల్ వ్యాక్సినేషన్ డే)

News March 16, 2026

తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకు కేడీసీసీబీ బ్యాంక్

image

కరీంనగర్ జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏటా వంద కోట్ల లాభలతో ప్రభుత్వ ప్రధాన బ్యాంకులకు ధీటుగా సేవలు అందిస్తూ తొమ్మిదో సారి జాతీయ ఆవార్డుకి ఎంపికైనట్లు సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ ఆవార్డును 17వ తేదిన సిక్కిం రాజధాని గ్యాంగ్ టక్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని, ఇది అందరి సమిష్టి విజయం అని తెలిపారు.