News August 21, 2025
ఒంటిమిట్టలో శ్రీవారి లడ్డూల విక్రయం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య సన్నిధిలో తిరుమల శ్రీవారి దేవస్థానం ఆధ్వర్యంలో 200 శ్రీవారి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉన్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. నేడు ఉదయం 7:30 గంటల నుంచి లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయిస్తారన్నారు.
Similar News
News January 24, 2026
మృతుడి భార్యకు ఉద్యోగం ఇస్తాం: కడప ఎమ్మెల్యే

కడపలో గురువారం నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రలో <<18946125>>మృతి చెందిన హరి<<>> భార్యకు ఉద్యోగంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని MLA మాధవి రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ కడప రిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అయోధ్య ఐక్యవేదిక సభ్యులు, మేయర్ సురేశ్, టీడీపీ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుమారుడి చదువు కోసం సహాయం అందిస్తామని ఐక్యవేదిక సభ్యులు హామీ ఇచ్చారు.
News January 24, 2026
పుష్పగిరిలో అద్భుత శిల్పం

వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని ‘పాద కంటక’ (ముళ్లు తీసే) శిల్పం అద్భుతమని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్ తెలిపారు. సాధారణ గిరిజన వేషధారణకు భిన్నంగా, ఇందులో కిరాత దంపతులకు పట్టు వస్త్రాలు, నగలు చెక్కడం శిల్పి నైపుణ్యానికి, చిత్రభాషకు నిదర్శనమన్నారు. ఇది గిరిజన సాంప్రదాయాన్ని దైవత్వంతో ముడిపెట్టే అపురూప దృశ్యమని శనివారం ఆయన పేర్కొన్నారు.
News January 24, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.16,210
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,913
* వెండి 10 గ్రాములు ధర రూ.3,430.


