News August 24, 2024

ఓజిలి: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

ఓజిలి మండలం 16వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. మండల కేంద్రమైన ఓజిలి బీసీ కాలనీకి చెందిన గోనుపల్లి రవి (35) అనే వ్యక్తి రాజుపాలెం పెట్రోల్ బంకు వైపు వెళుతుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి మృతితో బీసీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News January 18, 2026

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో గ్రీవెన్స్ డే సోమవారం జరగనుంది. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా అధికారులకు అందజేయవచ్చని చెప్పారు. Meekosam.ap.gov.in, 1100 కాల్ సెంటర్ ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News January 18, 2026

నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

image

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.

News January 18, 2026

వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

image

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.