News May 11, 2024
ఓటర్ స్లిప్పు రాలేదా.. ఆందోళన వద్దు

ఖమ్మం: ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఓటర్ స్లిప్పు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే స్లిప్పు రాకుండా ఒక ఎస్ఎంఎస్ తో పోలింగ్ బూతులో ఓటు ఉందో లేదో సులభంగా తెలుసుకొని అవకాశం ఉంది. ఓటరు తన ఫోను నుంచి ఈ సీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ కార్డు నెంబరు నమోదు చేసి 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు మెసేజ్ పంపించాలి. వెంటనే పోలింగ్ బూత్ నెంబర్ ఓటర్ జాబితాలోని క్రమసంఖ్య వివరాలతో మెసేజ్ వస్తుంది.
Similar News
News February 9, 2025
ఖమ్మం: స్థానిక సమరానికి రె‘ఢీ’

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. ఇటీవలే మండల కేంద్రాల్లో జాబితాను రూపొందించి, ప్రదర్శించారు. జిల్లాలో 8,52,879 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
News February 9, 2025
అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి సూసైడ్

అమెరికా న్యూయార్క్‌లో ఖమ్మం జిల్లా యువకుడు తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారు. చదువుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ ఆఫీసులోనే పాస్ పోర్టు వదిలేసినట్లు సమాచారం. అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2025
నిర్మలా సీతారామన్‌ను కలిసిన Dy.CM భట్టి

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖలను నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. ఆయన వెంట ఎంపీలు మల్లు రవి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు.