News May 13, 2024
ఓటు వేయడం మనందరి బాధ్యత: వేణుగోపాల్

ఓటు వేయడం మనందరి బాధ్యత అని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏం.వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 171వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఓటర్లకు కల్పించిన సదుపాయాలను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
Similar News
News December 14, 2025
PGRS సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, నేరుగా అయినా అర్జీలు సమర్పించవచ్చని చెప్పారు. 1100 టోల్ ఫ్రీకి డయల్ చేసి అర్జీల స్థితినితెలుసుకోవచ్చని చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 14, 2025
GNT: వరుసగా మూడోసారి మన జిల్లా టాప్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.
News December 14, 2025
కానిస్టేబుల్ నియామక పత్రాల కార్యక్రమ ఏర్పాట్లపై SP పరిశీలన

మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ ప్రాంగణంలో ఈ నెల 16న నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే మార్గాలు, వేదిక నిర్మాణం, కేడింగ్, వాహనాల పార్కింగ్, వీఐపీ రాకపోకలు, అభ్యర్థుల ప్రవేశ-నిష్క్రమణ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.


