News May 14, 2024
ఓటేయని ఎమ్మెల్యే బుర్రా

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ MLA ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిన్న పోలింగ్ సరళిని పరిశీలించడానికి కందుకూరులో విస్తృతంగా పర్యటించారు. ఈక్రమంలో ఆయన కనిగిరికి వెళ్లి ఓటు వేయలేకపోయారు. బుర్రా తీరుపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Similar News
News December 15, 2025
ఒంగోలు మేయర్ అంటే.. లెక్కలేదా: సుజాత

ఒంగోలు మేయర్ గంగాడ సుజాతకు కోపమొచ్చింది. నేడు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు సైతం హాజరవుతున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకంపై మేయర్ సుజాత పేరు లేకపోవడం, అలాగే ఆహ్వాన పత్రికలో సైతం ఆమె పేరు లేకపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
News December 15, 2025
జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

డిసెంబర్ నెల 15వ తేదీన సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని సూచించారు.