News November 16, 2025
ఓట్ల కోసం ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లింపు: PK

బిహార్‌లో ఓటమి తర్వాత JSP చీఫ్ ప్రశాంత్ కిశోర్ NDAపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన రూ.14,000 కోట్లను ఎన్నికల సమయంలో మళ్లించారని ఆరోపించారు. వాటిని మహిళల ఖాతాల్లోకి రూ.10వేల చొప్పున జమ చేశారన్నారు. జూన్ నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ప్రభుత్వం ఓట్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. దీనిపై EC దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 23, 2026
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 769.67 పాయింట్లు క్షీణించి 81,537.70 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241.25 పాయింట్లు పడిపోయి 25,048.65కు దిగజారింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (Indigo), సిప్లా వంటి షేర్లు భారీగా నష్ట పోయాయి. డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ONGC వంటివి కొంత మేర లాభాల్లో నిలిచాయి.
News January 23, 2026
బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని బీపీ ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల హైబీపీని తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ఆకుకూరలు, అరటి పళ్లు, ఓట్స్, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, సాల్మన్, మాకేరెల్ చేపలను తీసుకోవాలి. అలాగే సాసేజ్, ప్రాసెస్ చేసిన మాంసం, సోడాలు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, నిల్వ పచ్చళ్లు, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News January 23, 2026
రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులు బంద్!

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రేపు 4వ శనివారం కాగా ఎల్లుండి ఆదివారం. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. ఇక వారానికి 5 రోజుల పనిదినాలు డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు మంగళవారం(27న) సమ్మెకు దిగనున్నాయి. దీంతో ఆరోజు కూడా తెరుచుకునే పరిస్థితి లేదు. ఫలితంగా వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.


