News December 3, 2025

ఓడరేవుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు: MP మేడా

image

ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని MP మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్లో కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవుల అభివృద్ధి గురించి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ప్రశ్నలు అడిగారు. పోర్టు ఆర్ధిక కార్యకలాపాలలో ఎస్సీ, ఎస్టీ కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుసరించిన తీరును అడిగారు. లింగ సమానత్వ ఉపాధి, సమాన అవకాశాల కల్పన కోసం తీసుకున్న చర్యలు వివరించాలన్నారు.

Similar News

News February 12, 2026

నేడు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొల్లు రవీంద్ర, బుద్ధప్రసాద్, బోడె ప్రసాద్, వెంకట్రావు, రాము, కృష్ణప్రసాద్, కుమార్‌ రాజా పాల్గొననున్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ప్రాధాన్య ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.

News February 12, 2026

ఆన్‌లైన్‌లో వేప పుల్లలు.. రూ.2వేల పైనే!

image

మన దగ్గర ఉచితంగా లభించే ఎన్నో ప్రొడక్ట్స్‌ను ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తుంటాం. అందులో ‘వేప పుల్ల’ ఒకటి. అమెజాన్ వంటి షాపింగ్ సైట్స్‌లో 20 పుల్లలకు రూ.160వరకు ఉంటోంది. అదే అమెరికా వంటి దేశాల్లో వీటిని రూ.2వేల వరకూ విక్రయిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జీవనశైలిలో భాగంగా చాలామంది వేపపుల్ల వైపు మళ్లుతున్నారట. వేపలోని సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్లను దృఢపరుస్తాయి.

News February 12, 2026

44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

UPSC 44 ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in