News December 3, 2025
ఓడరేవుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు: MP మేడా

ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని MP మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్లో కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవుల అభివృద్ధి గురించి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ప్రశ్నలు అడిగారు. పోర్టు ఆర్ధిక కార్యకలాపాలలో ఎస్సీ, ఎస్టీ కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుసరించిన తీరును అడిగారు. లింగ సమానత్వ ఉపాధి, సమాన అవకాశాల కల్పన కోసం తీసుకున్న చర్యలు వివరించాలన్నారు.
Similar News
News February 10, 2026
బాల్య వివాహ రహిత జిల్లాగా అనంతపురం: కలెక్టర్

అనంతపురాన్ని బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘బాల్య వివాహ విముక్త భారత్’ ప్రచార రథాన్ని ప్రారంభించి, గోడపత్రికను ఆవిష్కరించారు. వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. 3 నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాలల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
News February 10, 2026
కొడంగల్‌లో సీఎం ఓటేయడానికి వస్తారా?

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరిగే పోలింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు సమాచారం. సీఎం బుధవారం కొడంగల్‌కు రానున్నట్లు తెలిసింది. సీఎం సొంత నియోజకవర్గం హెడ్ క్వాటర్ కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉ.7 నుంచి సాయంత్రం 5గం. వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది.
News February 10, 2026
‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్!

దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సెన్సార్ వివాదంలో భాగంగా నిర్మాత వేసిన కేసు ఉపసంహరణకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. దీంతో సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు చిత్రం వెళ్లనుంది. క్లియరెన్స్ లభిస్తే ఈ నెలలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ రాజకీయ ఎంట్రీకి ముందు వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.


