News December 3, 2025

ఓడరేవుల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు: MP మేడా

image

ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని MP మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్లో కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవుల అభివృద్ధి గురించి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో మంగళవారం ప్రశ్నలు అడిగారు. పోర్టు ఆర్ధిక కార్యకలాపాలలో ఎస్సీ, ఎస్టీ కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి అనుసరించిన తీరును అడిగారు. లింగ సమానత్వ ఉపాధి, సమాన అవకాశాల కల్పన కోసం తీసుకున్న చర్యలు వివరించాలన్నారు.

Similar News

News February 13, 2026

KMR: ఆరుగురి హత్య.. నిందితుడికి మరణ శిక్ష

image

ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబాన్నే కడతేర్చిన కిరాతక ఘటనలో కామారెడ్డి న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించినట్లు కామారెడ్డి SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు మెడిద ప్రశాంత్‌కు మరణశిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. మరో ఇద్దరు నిందితులు గుగులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మలకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించారు.

News February 13, 2026

వర్ధన్నపేటలో హంగ్.. BRS 6, కాంగ్రెస్ 5

image

వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా BRS 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. కాగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 7 ఏ పార్టీ సాధించకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో వర్ధన్నపేటలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 13, 2026

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

image

పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాన్ని కూడా గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది.