News August 20, 2025
ఓపెన్ ఇంటర్, టెన్త్ అడ్మిషన్ల ప్రారంభం: డీఈఓ

APOSS ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ ఇంటర్, టెన్త్‌లో అడ్మిషన్లు పొందడానికి జూన్ 12న నోటిఫికేషన్ జారీ చేశామని డీఈఓ కిష్టప్ప మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 15న వరకు రూ.200 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 10వ తరగతికి 14 సంవత్సరాలు, ఇంటర్‌కు 15 సంవత్సరాలు నిండినవారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు www.apopenschool.ap.gov.in వెబ్సైట్ సందర్శించాలని తెలిపారు.
Similar News
News January 19, 2026
HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

సంగారెడ్డి: నేటి నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 19 నుంచి మార్చి 8 వరకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. బైపాస్ రహదారిలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాచ్‌కు 100 మంది చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.