News May 7, 2025

ఓబులవారిపల్లి: గాదెల వీఆర్ఏపై దాడి

image

ఓబులవారిపల్లి మండలం గాదెల వీఆర్ఏ పెంచలయ్యపై అదే గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. సర్వే విషయమై నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా అతనిపై దాడి జరిగింది. ఈ మేరకు ఓబులవారిపల్లి ఎస్సై మహేశ్‌కు బాధితుడు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.

Similar News

News February 13, 2026

BREAKING: సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ పీఠాలు కాంగ్రెస్‌వే

image

మంత్రి పొంగులేటి ఇలాకా కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీ పీఠాలు కాంగ్రెస్ గెలిచింది. కల్లూరులో మొత్తం 20 వార్డులకు 12 వార్డులు కాంగ్రెస్ గెలిచి మున్సిపల్ పీఠాన్ని సాధించింది. ఇక్కడ BRS 7, ఇండిపెండెంట్ 1 వార్డు గెలిచాయి. ఇక సత్తుపల్లిలో 23 వార్డులకు గాను 14 వార్డులు కాంగ్రెస్ గెలిచి మున్సిపల్ పీఠాన్ని సాధించింది. ఇక్కడ BRS 4 గెలుపొందగా మిగతా చోట్ల కౌంటింగ్ జరుగుతోంది.

News February 13, 2026

GNT: టిప్పర్ ఢీకొని స్పాట్ డెడ్.. అవయవాలు నుజ్జునుజ్జు!

image

గుంటూరు అమరావతి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెకానిక్ షాప్‌లో పనిచేసే యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ లారీ అతణ్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ టైర్లు ఎక్కడంతో ఆ యువకుడి శరీరం నుజ్జునుజ్జై ఘటన స్థలంలోనే తుదిశ్వాస విడిచాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 13, 2026

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్

image

మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కుమార్ జిల్లా మేనేజర్ ఉదయ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.