News September 12, 2025

ఓబులవారిపల్లి: జ్వరంతో చిన్నారి మృతి

image

ఓబులవారిపల్లి (M) వై. కోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల చందన జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకుంది. కోడూరుకు తరలిస్తుండగా చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. కోడూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించాలని సూచించారు. తిరుపతికి తీసుకెళ్తుండగా చిన్నారి మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News December 12, 2025

పల్నాడు: జిల్లా వైసీపీ మీడియా ప్యానలిస్ట్‌గా విజయభాస్కర్ రెడ్డి

image

వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వైసీపీ మీడియా ప్యానలిస్ట్‌గా సత్తెనపల్లికి చెందిన చిట్టా విజయభాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఈ జాబితాను విడుదల చేసింది. వైసీపీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన చిట్టా, గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

News December 12, 2025

కామారెడ్డి జిల్లాలో 21 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్

image

కామారెడ్డి జిల్లాలో 21 ప్రదేశాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ల ఆధారంగా అత్యధిక ప్రదేశాల్లో 10°C లోపు ఉష్ణోగ్రతలు నమోదయి ఆరెంజ్ అలర్ట్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా 11 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ లో ఉండగా 15°C లోపు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో కామారెడ్డి జిల్లా ఒకటి.

News December 12, 2025

వనపర్తి: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు -ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగనుండడంతో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, మదనాపూర్, అమరచింత మండలాల్లో ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు రెండవ విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీత రెడ్డి స్పష్టం చేశారు.