News September 9, 2025
ఓయూ: లా కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ తదితర కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, 2, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల వివరాలను ఓయూ వెబ్‌సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
Similar News
News December 6, 2025
HYD: 31st NIGHT.. లోడింగ్!

సెలబ్రేషన్ అంటే హైదరాబాదీ ముందుంటాడు. రిలాక్స్ కోసం ప్రతి వీకెండ్‌లో పబ్‌లు, టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లే నగరవాసి ఏడాది చివరిరోజైన DEC 31ST నైట్ చేసే ప్లానింగ్ మామూలుగా ఉండదు. న్యూ ఇయర్‌కు ఇంకా 25 రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సిటీలో స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారా? అని టికెట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కొందరేమో శివారులోని ఫామ్ హౌస్‌లకు ఓటేస్తున్నారు. మరి మీ ప్లాన్ ఏంటి?
News December 6, 2025
HYDలో పెరుగుతున్న ‘ఫబ్బింగ్’ కల్చర్!

సిటీలో సామాజిక విలువలు పడిపోవడానికి ‘ఫబ్బింగ్’ కారణం అవుతోంది. చుట్టూ అందరూ ఉన్నా వారిని పట్టించుకోకుండా స్క్రీన్ చూడటం, మెసేజ్‌లు చెక్ చేయడం, ఫోన్‌కే అతుక్కోవడాన్ని ఫబ్బింగ్ అంటారు. ఇది అవతలి వ్యక్తికి గౌరవం లేదన్న భావన కలిగిస్తుంది. ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. బంధాలను నిలబెట్టాలంటే ఈ డిజిటల్ ద్రోహాన్ని ఆపాలి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరు ఫబ్బింగ్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.


