News November 8, 2025
ఓరుగల్లుకు కల్వకుంట కవిత..!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత నవంబరు 8, 9న WGL, HNK జిల్లాల్లో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కవిత ఓరుగల్లుకు రానున్నారు. 2 రోజుల పర్యటనలో ఆమె తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరిచేలు పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. అలాగే, HNKలో సమ్మయ్యనగర్, అమరావతి నగర్, వివేక్‌నగర్ ప్రాంతాల్లో బాధితులను కలుస్తారు. జాగృతి నేతలు కవితకు స్వాగతం పలకనున్నారు.
Similar News
News January 14, 2026
కపిలతీర్థం ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మణివాచకర్ గురుకుల్, స్వామినాథన్ గురుకుల్ మిరాసియేతర అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి సేవలను క్రమబద్ధీకరణ కోసం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపగా.. ప్రభుత్వం మంగళశారం జీవో విడుదల చేసింది.
News January 14, 2026
శుభ సమయం (14-1-2026) బుధవారం

➤ తిథి: బహుళ ఏకాదశి సా.5.55 వరకు
➤ నక్షత్రం: అనురాధ రా.3.30 వరకు
➤ శుభ సమయాలు: ఉ.9.20-10.16 వరకు, మ.12.29-2.52 వరకు, తిరిగి మ.3.47-సా.4.42 వరకు
➤ రాహుకాలం: మ.12.00-1.30 వరకు
➤ యమగండం: ఉ.7.30-9.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.11.44-12.28 వరకు
➤ వర్జ్యం: ఉ.7.06 వరకు
News January 14, 2026
జనగణన-2027కు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

భారత జనగణన-2027 నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కేంద్ర సెన్సెస్ డైరెక్టరు జె.నివాస్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రావత్‌లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.


