News August 23, 2025

ఔటర్ నుంచి ఎల్కతుర్తికి షార్ట్ కట్

image

వరంగల్ ఔటర్ నుంచి నేరుగా ఎల్కతుర్తికి కొత్త 100 ఫీట్ల రోడ్ రాబోతోంది. ఇదివరకు చింతగట్టు మీదుగా హసన్పర్తి నుంచి ఎల్కతుర్తికి చేరుకోవాల్సి వచ్చేది. దేవన్నపేట టోల్ ప్లాజా నుంచి మడిపల్లి మీదుగా నేరుగా ఎల్కతుర్తికి 10 నిమిషాల్లో చేరుకునే వీలుగా రూ.15 కోట్లతో 5కి.మీ. 100ఫీట్ల రహదారికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చింతగట్టు, హసన్పర్తి మీదుగా వెళ్లాల్సిన పని ఉండదు. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి.

Similar News

News January 23, 2026

జగిత్యాల: 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను శుక్రవారం 108 జిల్లా మేనేజర్ యశోద ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఉన్న సక్షన్ ఆపరేటర్, మల్టీఛానల్ మానిటర్, AEDతో పాటు ఇతర వైద్య పరికరాల పని తీరు, ఆక్సిజన్, అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే మందులను, పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అన్ని వేళల అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు సూచించారు.

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్ల స్కాం.!

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.3 కోట్లు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం గుట్టు రట్టయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2026

రాహుల్, థరూర్ మధ్య ముదిరిన విభేదాలు?

image

రాహుల్ గాంధీపై శశి థరూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలో వేదికపై తన పేరును రాహుల్ కావాలనే ప్రస్తావించలేదని థరూర్ నొచ్చుకున్నట్లు సమాచారం. దీంతో కేరళ ఎన్నికల సన్నద్ధతపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో PM మోదీని పొగిడారనే కారణంతో పార్టీ నాయకత్వం థరూర్‌ను పక్కన పెడుతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.