News August 12, 2025
కంగ్టి : గుండెపోటుతో రైతు మృతి

గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన కంగ్టి మండలం నాగంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బావుగే శంకరప్ప గత నెలలో ఛాతిలో నొప్పి రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. సోమవారం మరోసారి గుండెపోటు రావడంతో రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మృతి పట్ల గ్రామంలో విషాదం అలుముకుంది.
Similar News
News March 15, 2026
ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్ వాపోయారు.
News March 15, 2026
రేపు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో PGRS

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని అన్నారు.
News March 15, 2026
శ్రీరామనవమి నాడు ‘భద్రగిరి గిరిజన మార్ట్’ ప్రారంభం

గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శ్రీరామనవమి నాడు భద్రగిరి మార్ట్ ప్రారంభించనున్నట్లు APO డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ.. మార్ట్ విజయవంతానికి వ్యాపారులు తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూనే, నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు.


