News April 21, 2024
కంచరపాలెం: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఊర్వశి జంక్షన్ జాతీయ రహదారి సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీఐ భాస్కరరావు నేతృత్వంలో ఏఎస్సై కనకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.
News December 10, 2025
14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.