News October 7, 2025
కడపలో యువతి ఆత్మహత్యాయత్నం

కడపలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల జిల్లాకు చెందిన యువతి రిమ్స్ డెంటల్ కాలేజీలో BDS ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఆమె ఎగ్జాం రాయాల్సి ఉంది. సరిగా పరీక్ష రాయలేనని భయాందోళనకు గురైంది. నిన్న ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. వెంటనే రిమ్స్ క్యాజువాలిటీ వార్డుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Similar News
News January 20, 2026
లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.
News January 20, 2026
కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.
News January 19, 2026
కడప: చంద్రప్రభ వాహనంపై దర్శనం

దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.


