News November 19, 2025
కడపలో సీఎం పర్యటన ఇలా.!

ఇవాళ పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన PM కిసాన్, అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి CM చంద్రబాబు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు.
☛ 1:25PM: పెండ్లిమర్రి (M) వెల్లటూరులోని హెలిప్యాడ్ వద్దకు వస్తారు
☛ 1:40 PM-4 PM: ప్రజావేదికలో ప్రసంగం
☛ 4:20 PM-5:05 PM: రైతులతో మాట్లాడతారు
☛ 5:15 PM- 6:15 PM: కార్యకర్తలతో మీటింగ్
☛ 6:50 PM: విజయవాడకు తిరుగు పయనమవుతారు.
Similar News
News January 17, 2026
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయనుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.
News January 17, 2026
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా మండల స్థాయిలో కార్యాచరణాత్మక వ్యవసాయ ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ఈ-క్రాప్ బుకింగ్‌ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, వరికి బదులుగా మల్లెపూలు, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, అరటి వంటి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంట సేకరణ, మార్కెటింగ్‌లో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
News January 17, 2026
పూజ గది ఎక్కడ ఉంటే ఉత్తమం?

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండాలనే నియమం అందరికీ వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇల్లు పెద్దదైతే ఈశాన్యం అనుకూలం, కానీ చిన్న ఇళ్లలో తూర్పు, పడమర దిశలలో, మధ్య భాగానికి ఉత్తరం వైపుగా జరిపి ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ‘పడకగది లేదా వంటగదిలో పూజ అస్సలు చేయకూడదు. పూజ గదికి పవిత్రతతో పాటు కాస్త గోప్యత కూడా అవసరమని గ్రహించాలి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


