News March 27, 2024

కడప, అన్నమయ్య జిల్లాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎన్నంటే

image

కడప జిల్లాలో 513, అన్నమయ్య జిల్లాలో 400 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామని కర్నూలు రేంజ్‌ డిఐజి సిహెచ్‌ విజయరావు తెలిపారు. అక్కడ ఆర్మూర్‌ రిజర్వుడ్‌ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ప్రత్యేక రూటు ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఒక వాహనంతో పాటు ఐదుగురు సిబ్బంది ఉంటారని స్పష్టం చేశారు.

Similar News

News February 10, 2026

రేపే అసెంబ్లీ: ఆకేపాటి, సుధ ఎంట్రీ ఇస్తారా..?

image

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా YCP MLAలు ఆకేపాటి అమరనాథరెడ్డి, దాసరి సుధ హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సమావేశాలకు దూరంగా ఉన్న వీరు కీలకమైన బడ్జెట్ సమావేశాల్లోనైనా అడుగుపెడతారా అన్న అంశంపై ఆయా నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సభలో పాల్గొని సమస్యలపై గళమెత్తి నిధులు రాబట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News February 10, 2026

SO..SAD కడప: మనుమడి బర్త్ డేకి వచ్చి మృతి.!

image

కడపలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్పీబంగ్లా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెళ్లే మార్గంలో జిల్లాని కోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రాయచోటికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. తన మనుమడి పుట్టినరోజుకు కడపకు రాగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

News February 9, 2026

ఎర్రగుంట్ల: కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు

image

ఎర్రగుంట్ల(M) పోట్లదుర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాకోబ్(60) తన తల్లి సుందరమ్మ(90)పై ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బంధువులు వెంటనే ఆమెను ప్రొద్దుటూరుకు, ఆపై RIMSకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు CI విశ్వనాథరెడ్డి తెలిపారు. జాకోబ్ తన కూతురు లత వద్ద రూ.18 లక్షలు తీసుకున్నాడు. ఈ అప్పును తీర్చమన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు CI చెప్పారు.