News June 16, 2024

కడప: ఆర్టీసీ బస్సు ఢీకొని.. ఇద్దరు మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన కడప నగర పరిధిలోని అలంఖాన్ పల్లి సర్కిల్ దగ్గర జరిగింది. ఆదివారం రాత్రి కర్నూలు నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటర్‌ని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు మరణించారని, ఒకరికి గాయాలయ్యాయని తెలిపారు. మృతులు బద్వేల్ నివాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 18, 2026

కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కడప జిల్లాతో NTRకు అనుబంధం.. మీకు తెలుసా!

image

దివంగత నేత NTRకు కడపతో ప్రత్యేక అనుబంధం ఉంది. NTR 1983లో తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారం కోసం చైతన్య రథంలో హరికృష్ణ డ్రైవర్‌గా రోడ్డు షో నిర్వహించారు. ఈ యాత్ర తాళ్ల ప్రొద్దుటూరు, పాతచౌటపల్లి, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా సాగింది. పాతచౌటపల్లి చిత్రావతి నదిలో చైతన్య రథం మొరాయించడంతో అక్కడే ఆయన బస చేశారు. తిరిగి 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. నేడు NTR వర్ధంతి.