News May 21, 2024
కడప-చెన్నై రహదారిపై రెండు బస్సులు ఢీ

ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం మలినేని పట్నం సమీపంలో కడప-చైన్నై ప్రధాన రహదారిపై మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బద్వేల్ నుంచి కడపకు వెళ్తున్న బస్సును.. తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో పాక్షికంగా దెబ్బతింది. సంఘటనా స్థలానికి ఎస్సై పెద్ద ఓబన్న చేరుకోని విచారిస్తున్నారు.
Similar News
News March 6, 2026
కడప జిల్లాలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు ఎంతమందంటే.!

కడప జీఎస్టీ డివిజన్లో 8 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 34,132 మంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు ఉన్నారు.
➤ కడప సర్కిల్-1లో 6031 మంది
➤ కడప సర్కిల్-2లో 4411
➤ ప్రొద్దుటూరు సర్కిల్-1లో 3450
➤ ప్రొద్దుటూరు సర్కిల్-2లో 4504
➤ పులివెందులో 2617
➤ రాయచోటిలో 5983
➤ మదనపల్లెలో 7032
➤ కడప స్పెషల్ సర్కిల్‌లో 99 జీఎస్టీ రిజిస్ట్రేషన్ దారులు ఉన్నారు.
News March 6, 2026
పులివెందుల సీఐగా శ్రీరామ్

గతంలో ప్రొద్దుటూరులో పనిచేసిన సీఐ శ్రీరామ్‌ను పులివెందుల సీఐగా బదిలీ చేస్తూ కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామిరెడ్డిని పులివెందుల టౌన్ నుంచి రూరల్‌కు, శాంతిలాల్‌ను కడప వీఆర్ నుంచి పులివెందుల ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. శంకర్ రెడ్డిని కడప RSTF నుంచి RK వ్యాలీకి, ఉలసయ్యను RK వ్యాలీ నుంచి కడప వీఆర్‌కు, హాజీవల్లీని పులివెందుల ట్రాఫిక్ నుంచి నంద్యాల DPTCకి బదిలీ చేశారు.
News March 6, 2026
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌పై విచారణ.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB తనిఖీల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు, అక్రమ భవనాలు క్రమబద్ధీకరణ, భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.


