News February 22, 2025

కడప జిల్లాలో టమాటా రైతులకు శుభవార్త

image

కడప జిల్లాలో టమాట రైతులు పంట పండించి ఎలాంటి గుర్తింపుకార్డు లేకపోయినా రైతు బజార్లో సరుకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు కలెక్టర్ శ్రీధర్, జేసీ అతిథి సింగ్ తెలిపారు. కూరగాయల పంట సీజన్ కావడంతో అధిక దిగుబడి వచ్చిందని, గ్రామాల్లో ధర లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చన్నారు.

Similar News

News March 24, 2025

లింగాల మండలంలో వైఎస్ జగన్

image

లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. తీవ్ర ఈదురుగాలులతో నేలకూలిన అరటి పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు భరోసా కల్పిస్తున్నారు. జగన్ వెంట కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఉన్నారు. మండలంలో దాదాపు 2500 ఎకరాలలో అరటి తోట నేలవాలినట్లు అంచనా వేశారు.

News March 24, 2025

ఎర్రగుంట్ల: మోసాల్లో ఇదో కొత్త రకం

image

బంధువని చెప్పి మాటల్లో పెట్టి మోసంచేసే కేటుగాడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన ఖాసీంపీరా చెడు వ్యసనాలకు బానిసై అప్పులుచేసి, అవి తీర్చడానికి అడ్డదారులు ఎంచుకున్నాడు. ఈనెల 9న ఎర్రగుంట్లలో మహబూబీ అనే వృద్ధురాలిని బంధువని నమ్మించాడు. ‘తన కూతురి పెళ్లికి రావాలని, మీ చేతికి ఉన్న ఉంగరం లాంటిది చేయిస్తానని చెప్పి, ఇవ్వాలని తీసుకొని’ ఉడాయించాడు.

News March 24, 2025

కడప: యథావిధిగా ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. జిల్లా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

error: Content is protected !!