News October 5, 2024

కడప జిల్లాలో 83 వీఆర్వోలు బదిలీ

image

కడప జిల్లాలో పలువురు వీఆర్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1, 2 విలేజ్ రెవెన్యూ అధికారులు 83 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా 48 మందిని బదిలీ చేశారు. అనంతరం 15, 6, 12, 2 ఇలా వరుసగా 5 ఉత్తర్వులు విడుదల చేశారు. వీళ్లందరిని కొందరిని కడప జిల్లాలోని పోస్టింగ్‌‌లు ఇవ్వగా మరికొందరిని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేశారు.

Similar News

News April 17, 2026

కడపలో సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు

image

కడపలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజ రాజేశ్వర్ రెడ్డిలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరినీ విధుల్లో నుంచి తప్పించి కర్నూలు వీఆర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవల జరిగిన కొన్ని వివాదాస్పద అంశాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు చర్చ నడుస్తోంది.

బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

image

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.