News April 11, 2025

కడప జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

కడప జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News January 22, 2026

అన్న క్యాంటిన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

జిల్లాలో అన్న క్యాంటిన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కడప కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. క్యాంటిన్లలో ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వినియోగదారులు వంద శాతం సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 22, 2026

కడప జిల్లాలో పురాతన తెలుగు శాసనం గుర్తింపు

image

సిద్ధవటం మండలం టక్కోలి గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి, కార్య దర్శి శ్రీనివాసులు తెలిపారు. మాచుపల్లి శ్రీ రేణుకా ఎల్లమాంబ దేవాలయాన్ని దర్శించుకున్న వారు టక్కోలి గ్రామానికి చెందిన శివాలయంన్ని సందర్శించగా అక్కడ ప్రాచీన తెలుగు శాసనం ఉందన్నారు.

News January 22, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,580
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,334
* వెండి 10 గ్రాముల ధర: రూ.3150.