News November 19, 2025

కడప: నడిరోడ్డుపై కొట్లాడుకున్న పోలీసులు

image

పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో మంగళవారం పోలీసుల మధ్య గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం జరగనుంది. ఈ క్రమంలో బందోబస్తుగా మంగళవారం వచ్చిన ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ ఓ హోటల్ వద్ద మాట మాట పెరిగి గొడవకు దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు నడిరోడ్డుపై కలబడ్డారు. స్థానికులు, తోటి పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

Similar News

News January 22, 2026

పాడేరు: ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల

image

RBSK ప్రోగ్రామ్-DEICలో భాగంగా పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్నవారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదలైందని జరిగిందని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ గురువారం తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 23వ తేదీలోగా తెలపాలని సూచించారు. మరిన్ని వివరాలకు allurisitharamaraju.ap.gov.in వెబ్సైట్‌ని సంప్రదించాలన్నారు.

News January 22, 2026

హుజూర్‌నగర్: విద్యార్థులే అంబాసిడర్లు: ఎస్పీ నరసింహ

image

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు రోడ్డు భద్రత అంబాసిడర్లుగా మారి తల్లిదండ్రులు, ప్రజల్లో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.

News January 22, 2026

పెనుగంచిప్రోలు: వృద్ధురాలి నేత్రదానం.. నలుగురికి చూపు!

image

పెనుగంచిప్రోలుకు చెందిన రాజ్యలక్ష్మి (70) రోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందిన రాజ్యలక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే ముందు, ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించగా, వైద్య బృందం రాజ్యలక్ష్మి నేత్రాల నుంచి కార్నియాను సేకరించారు. రాజ్యలక్ష్మి మరణించినా, ఆమె దానం చేసిన నేత్రాల ద్వారా నలుగురు అంధులకు చూపు లభించనుంది.