News April 24, 2025
కడప: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు, ఇడుపులపాయ ఐఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 6, 2026
చౌటుప్పల్: బైక్ దొంగల అరెస్ట్.. ముగ్గురు రిమాండ్‌కు

చౌటుప్పల్ మండలంలో జరిగిన రెండు వేర్వేరు బైక్ చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాప్ ముందున్న స్ప్లెండర్, ఇంటి ముందు పార్క్ చేసిన ఆక్టివా ఎలక్ట్రిక్ బైక్‌లను దొంగిలించిన నిందితులు బతుల మణి, తమ్మిశెట్టి పెద్దిరాజు, కందగట్ల కిరణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
News March 6, 2026
చెన్నూరు: ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. చెన్నూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేను ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోస్ట్కాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News March 6, 2026
దీదీకి కొత్త తలనొప్పి?

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


